యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిగా కృష్ణ

గంగవరం (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిగా మండలానికి చెందిన కే. కృష్ణ నాలుగోసారి ఎన్నికయ్యారు. ఉప్పాడ కొత్తపల్లిలో జరిగిన యూటీఎఫ్ జిల్లా మహాసభల్లో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని పిడతమామిడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునడిగా పనిచేస్తున్న కృష్ణ వరుసగా నాలుగో సారి జిల్లా కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆయన ఎంపిక పట్ల యూటీఎఫ్ మండల కమిటీ హర్షం వ్యక్తం చేసింది. హర్షం వ్యక్తం చేసిన వారిలో మండల కమిటీ గౌరవ అధ్యక్షుడు పి. రాంబాబు, అధ్యక్షుడు రఘుబాబు దొర, ప్రధాన కార్యదర్శి రాంబాబు దొర, యూటీఎఫ్ నాయకులు రుక్మిణి, నాగమణి, లక్ష్మి, రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us