జాతీయ సేవా కార్యక్రమంలో ఆదిత్య బిజినెస్ స్కూల్ విద్యార్థులు

UPDATED 24th JUNE 2019 TUESDAY 5:30 PM

పెద్దాపురం: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ బిబిఏ విద్యార్థులు జాతీయ సేవా కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని ఆనూరు గ్రామంలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల, పంచాయితీ భవనం, పశువైద్యశాలల్లో గల పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు జాతీయ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వివిధ గ్రామాలలో సేవలు అందిస్తున్నారని, విద్యార్థులు ప్రథమ సంవత్సరం నుంచి ఎన్ఎస్ఎస్ ద్వారా సేవా కార్యక్రమాలలో పాల్గోవడం అభినందనీయమని అన్నారు. ఈ విధంగా ప్రతీ ఒక్కరూ స్వచ్చంధంగా సేవా కార్యక్రమాలలో పాల్గొని దేశాభివృద్ధికి సహకరించాలని సూచించారు. పచ్చదనం-పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలలో గ్రామస్థులు పాల్గొని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం. గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలను సంరక్షించి వాటిని ఎదిగేలా విద్యార్థులు బాధ్యత తీసుకోవాలని అన్నారు. సుమారు 100  మొక్కలను నాటి "వృక్షో రక్షతి రక్షితః" అని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులను   కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ, తదితరులు అభినందించారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us