UPDATED 10th AUGUST 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సామర్లకోట మండలం వేట్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విదార్థులకు జెడ్పీటీసీ సభ్యురాలు గుమ్మళ్ళ విజయలక్ష్మి ఆల్బెండజోల్ మాత్రలు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నులిపురుగులు ఉన్న పిల్లలు పోషకాహారలోపం, రక్తహీనతలతో ఎప్పుడూ అలసిపోతారని, శారీరక, మానసిక అభివృద్ధిలో మందకొడిగా ఉంటారని చెప్పారు. పిల్లలకు నులి పురుగులు రాకుండా సులభంగా నియంత్రించడానికి ఆల్భెండజోల్ మాత్రలు మింగించడమే మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







