ప్రజావాణికి ఐదు అర్జీలు

UPDATED 3rd JUNE 2019 MONDAY 8:00 PM

పెద్దాపురం: స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఐదు అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు తెలిపారు. వీటిలో గురుకుల పాఠశాలలో ఎస్సీ కులస్తుల విద్యార్ధుల ప్రవేశానికి సహకారం అందజేయమని, అలాగే మురుగు కాలవలో పేరుకుపోయిన చెత్తను తొలగించమని, ల్యాండ్ కన్వర్షన్, ఎస్టీ కులస్తుల ధ్రువీకరణ పత్రం మంజూరు కొరకు, పుట్టిన ధృవీకరణ పత్రంలో పేరును సవరించమని అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతీ అర్జీకి పరిష్కారం చూపాలని, అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను ఆయన హెచ్చరించారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us