ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం

UPDATED 30th AUGUST 2019 FRIDAY 8:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న అస్తవ్యస్త ఇసుక విధానాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు టిడిపి నాయకులు స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ రాజా సూరిబాబు రాజు మాట్లాడుతూ ఇసుక కొరతతో అనేక  కుటుంబాలు రోడ్డున పడ్డాయని, గతంలో రూ.రెండు వేల దాకా ఉన్న ఇసుక ప్రస్తుతం రూ.ఏడు నుంచి రూ.ఎనిమిది వేల దాకా ధర పలుకుతోందని అన్నారు. వైసిపి నాయకులు, కార్యకర్తల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇసుకను ఫలహారంగా పంచి పెడుతూ సామాన్య, బలహీన వర్గాల వారిని ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. ఇసుకను కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి రేయింబవళ్లు అక్రమంగా తరలిస్తూ వైసిపి నాయకులు అక్రమార్జనకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇసుక కొరతతో నిర్మాణాలు ఆగిపోయి సిమెంటు, ఉక్కు, ఇతర నిర్మాణ సామగ్రికి గిరాకీ లేకుండా పోయిందని, ఫలితంగా అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆరోపించారు. పేదలందరికీ ఇసుక అందుబాటులో ఉండేలా ఉచిత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆర్డీవో ఎస్. మల్లిబాబుకు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో గుడా మాజీ డైరెక్టర్ ఎలిశెట్టి నాని, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, తెలుగు యువత మండలాధ్యక్షుడు నూనె రామారావు, ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ ఆచంట రాజన్న, మహారాణీ సత్రం మాజీ చైర్మన్ తూతిక రాజు, మాజీ కౌన్సిలర్లు త్సలికి సత్య భాస్కరరావు, కాకినాడ రామారావు, సీనియర్ టిడిపి నాయకులు మొయిళ్ల కృష్ణమూర్తి, సింగన అరవిందకుమార్, అడబాల కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.         

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us