ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేసేది వైసిపినే..

UPDATED 21st MARCH 2018 WEDNESDAY 9:00 PM

పెద్దాపురం: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం దేశవ్యాప్తంగా చర్చించుకునేలా చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కర్రి వెంకట రమణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో బుధవారం మాట్లాడారు. హోదా కోసం నాలుగు సంవత్సరాలుగా విరామం లేని అలుపెరుగని పోరాటాలు చేస్తూ పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికి కూడకట్టి హోదాను సజీవంగా ఉంచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు విశ్వాసం పెట్టుకున్నారన్నారు. ప్రత్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సును మరచి రాజకీయ ప్రాబల్యం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాకులాడుతున్నారని ఆయన ఆరోపించారు. నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని శాసనసభలో సొంతడబ్బా కొట్టించుకున్న చంద్రబాబు హోదా కోసం ఎప్పుడూ కూడా శ్రమించిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రానికి హోదా ఇవ్వలేమని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ 2016 సెప్టెంబర్ 9 వ తేదీ అర్ధరాత్రి ప్రకటించినప్పుడు ఈ రాష్ట్ర సీఎం ఉన్న చంద్రబాబు ఎందుకు స్వాగతించారని, ఆనాడు హోదా ఆకాంక్ష లేదా అని ప్రశ్నించారు. ఒకే ఒక్కడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హోదా కోసం కేంద్ర ప్రభుత్వంతో రాజీ లేని పోరాటం చేస్తుండడం పట్ల ఐదు కోట్ల ఆంధ్రులలో ఆదరణ, నమ్మకం పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక ఆర్ధిక నేరాల్లో కూరుకుపోయారని, ఇప్పటివరకు వాటిని మేనేజ్ చేసుకుని పబ్బం గడుపుతున్నారని ఆక్షేపించారు. చంద్రబాబు ఎప్పటికైనా జైలుకు వెళ్లడం తప్పదని, రాజధాని పేరుతో 52 వేల కోట్లు, నీటిపారుదల శాఖలో 5 వేల కోట్లు, సింగపూర్ కంపెనీల పేరుతో 27 వేల కోట్లు, ఇసుక మాఫియా, నీరు-చెట్టు, చంద్రన్న మజ్జిగ, మద్యం ముడుపులు, అగ్రి గోల్డ్, పుష్కరాలు పేరుతో వేలకోట్లు అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. దీంతోపాటు ఓటుకు నోటు కేసు మెడకు వేలాడుతుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని అన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us