రాష్ట్రంలో యస్.సి, యస్.టి ల అభ్యున్నతికి చర్యలు

* ఈ సంవత్సరం రూ.1.92 లక్షల కోట్లతో బడ్జెట్ అమలు
* రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు
UPDATED 5th MAY 2018 SATURDAY 9:00 PM
కాకినాడ: రాష్ట్రంలో యస్.సి, యస్.టి, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో రూ.15లక్షల వ్యయంతో నిర్మించిన యస్.సి సామాజిక భవనాన్ని శనివారం మంత్రి ఫ్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి యనమల మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ సంవత్సరం యస్.సి సబ్-ప్లాన్ క్రింద రూ. తొమ్మిది వేల కోట్లు, యస్.టి సబ్ ప్లాన్ క్రింద రూ.మూడు వేల కోట్ల కేటాయించమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో గత మూడున్నర సంవత్సరాలలో యస్.సి, యస్.టిల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తామని, అలాగే యస్.సి, యస్.టి బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కూడ చేపట్టామన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్ ను రూ. 1.92 లక్షల కోట్లతో అమలు చేస్తున్నామని, వచ్చే సంవత్సరం కూడా రూ. రెండు లక్షల కోట్లతో బడ్జెట్ ను రూపొందిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా గ్రూపుల రుణ మాఫీ చేపట్టామని, ఈ విధంగా మరే రాష్ట్రంలో చేపట్టలేదన్నారు. రాష్ట్రంలో గత మూడున్నర సంవత్సరాలుగా వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఆశాజనకంగా ఉన్నాయని, దీని ద్వారా గ్రామీణ ఆర్థిక రంగం బలపడుతుందని అన్నారు. యస్.సి కాలనీలలో నిర్మించే సామాజిక భవనాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటున్నాయని, రాష్ట్రంలో యువతలో నైపుణ్యం పెంపొందించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ యమ్.యల్.ఎ పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణమూర్తి, గ్రామ సర్పంచ్ ఎ. జగ్గారావు, ఉప సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, తహసీల్దార్ సింహాద్రి, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us