UPDATED 22nd JUNE 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: గ్రామీణ ప్రాంతాల్లోని భూ సమస్యలను పరిష్కరించేందుకే రెవెన్యూ గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ ఎల్. శివకుమార్ పేర్కొన్నారు. మండలంలోని మాధవపట్నం, జగ్గమ్మగారిపేట ప్రాంతాలలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. రైతులు అర్జీల రూపంలో తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ రెండు గ్రామసభల్లో అడంగల్ సవరణకు ఐదు దరఖాస్తులు, సర్వేకు ఒక దరఖాస్తు అందినట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, ఎంపిటిసి సభ్యుడు కొప్పిశెట్టి చినవెంకన్న, దేవాదాయ, మత్స్యశాఖ అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు, తదితరులు హాజరయ్యారు.







