UPDATED 5th APRIL 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక కొత్తపేట 11వ వార్డులొ దళిత ఆశాజ్యోతి బాబూ జగజ్జీవన్ రామ్ 111వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ మహాజన సంఘం (ఎంఎంజెఎస్) జిల్లా అధ్యక్షులు కాపవరపు కుమార్ పాల్గొని మాట్లాడుతూ దళిత అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన మహానీయుడని, దళితులకు దశదిశ మార్గంలో ఒక కన్ను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అయితే, రెండవ కన్ను బాబూ జగ్జీవన్ రామ్ అని, కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన పదవులకు వన్నె తెచ్చారన్నారు. అనంతరం పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాపవరపు భాను, గంధం చిన్నబ్బాయి, కాకడ చిన్ని, ఎంఎంజెఎస్ నాయకులు చేలేవాటి కొండలరావు, దళిత కళాకారులు సవరం మాణిక్యం, ఆజారి జోగినాథం, పలివెల అమ్మేరియా, కాకడ నాగార్జున, ఏడిద దుర్గాప్రసాద్, కాకడ సునీల్, నాగళ్ళ కాంతం, తదితరులు పాల్గొన్నారు.







