మండల పరిషత్ కార్యాలయంలో ఉగాది వేడుకలు

UPDATED 18th MARCH 2018 SUNDAY 10:00 PM

సామర్లకోట: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి ఆకునూరి సత్తిబాబు అధ్యక్షతన ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎల్. శివకుమార్ మాట్లాడుతూ ఇంగ్లీష్ సంవత్సరానికి ఇస్తున్న ప్రాధాన్యత తెలుగు సంవత్సరానికి ఇవ్వకపోవడం చాలా బాధాకరమని అన్నారు. అనంతరం కవులు రామకృష్ణ, నాయుడులను ఘనంగా సత్కరించారు. నాల్గవ తరగతి విద్యార్థి బి. శేషసాయి వేణుగానంతో అలరింపచేశాడు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో బి. నాగేశ్వరరావు, ఎంఇవో కె. వెంకట రమణమ్మ, ఈవోపీఆర్డీ సి.హెచ్. జగ్గారావు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us