మొక్కల సంరక్షణ మన అందరి భాద్యత

* హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప  
* రెండవ వార్డులో నగరదర్శిని-నగరవికాసం కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి

UPDATED 22nd SEPTEMBER 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: మొక్కల సంరక్షణ మన అందరి భాద్యతని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక కెనాల్ రోడ్డులోని ఐదు తూముల వద్ద నిర్వహించిన వనం-మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటడం వల్ల పర్యావరణం కాపాడవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనం-మనం కార్యక్రమాన్ని నిరంతరం ఒక ఉద్యమంలా కొనసాగించాలని అన్నారు. అనంతరం రెండో వార్డులో నగరదర్శిని-నగర వికాసం కార్యక్రమంలో భాగంగా మంత్రి వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఇ ఎన్. కృష్ణారావు, ఇఇ ఆర్. మోహనరావు, ఎఈ అప్పలరాజు, తహసీల్దార్ ఎల్. శివకుమార్, మున్సిపల్ కమీషనర్  సి.హెచ్. వెంకటేశ్వరరావు, కుమారారామ భీమశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, సభ్యులు మహంకాళి వెంకట గణేష్, దూది రాజు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, టిడిపి ప్రచార కార్యదర్శి మన్యం చందర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ అడబాల చిట్టిబాబు, సర్పంచ్ కుర్రా నారాయణస్వామి, గుమ్మళ్ల రామకృష్ణ, కౌన్సిలర్లు బడుగు శ్రీకాంత్, జుత్తుక సుబ్బలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us