UPDATED 24th JUNE 2019 MONDAY 8:00 PM
పెద్దాపురం: స్థానిక మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని సోమవారం దేవాదాయ శాఖ అధికారులు లెక్కించారు. 88 రోజులకు మొత్తం రూ.4,89,410 ఆదాయం సమకూరినట్లు దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ, ఆలయ వేద పండితులు చిట్టెం హరిగోపాల శర్మ, రాయి విజయకుమార్, దేవాదాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.







