కాకినాడ (రెడ్ బీ న్యూస్) 31 ఆక్టోబర్ 2021 : స్వాతంత్ర్యానంతరం దేశంలో విలీనం కాకుండా మిగిలిపోయిన సుమారు 560 సంస్థానాలను విలీనం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్‌పటేల్ అని, ఆయన సేవలు ఎనలేనివని ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు పేర్కొన్నారు. మాజీ ఉప ప్రధాని, హోం మంత్రి పటేల్ జయంతి సందర్భంగా ఏక్తా దివస్‌లో భాగంగా ఆదివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సర్పవరం జంక్షన వద్ద ‘రన ఫర్ యునిటీ’ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రంలో కీలకంగా వ్యవహరించిన జాతీయ నాయకుల నుంచి యువత స్ఫూర్తి పొందాలన్నారు. దేశం ముక్కలుగా విడిపోకుండా ఒకే దేశం అన్న నినాదంతో మొక్కవోని ధైర్యంతో విలీనం కాకుండా ఉన్న 560 సంస్థానాలను విలీనం చేసిన పటేల్ కార్యదక్షతను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. పోలీసు శాఖకు గర్వకారణమన్నారు. సర్పవరం జంక్షన వద్ద ప్రారంభమైన రన్ భానుగుడి సెంటర్ వరకు సాగింది. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పటేల్ చిత్రపటానికి ఎస్పీతో పాటు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీసులతో జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏఎస్పీ కరణం కుమార్, ఎస్‌బీ డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, శ్యామ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







