ఆనందలహరితో ఒత్తిడి లేని విద్య

UPDATED 20th SEPTEMBER 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట (రెడ్ బీ న్యూస్) : ఆనందలహరి అభ్యసనా విధానంతో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయని సర్వ శిక్షా అభియాన్ జిల్లా మోనిటరింగ్ కమిటీ అధికారి సుబ్రహ్మణ్యం అన్నారు. ఆనందలహరి అభ్యాసన తరగతి నిర్వహణపై మండల విద్యాశాఖాధికారిణి ఎస్. విజయలక్ష్మీదేవి అధ్యక్షతన సామర్లకోట మండల హుస్సేన్ పురం ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతుల ఉపాధ్యాయులకు  శుక్రవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వ శిక్షా అభియాన్ జిల్లా మోనిటరింగ్ కమిటీ అధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆనందలహరి అభ్యసన కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఆనంద వాతావరణంలో సాంకేతికత ఉపయోగించుకుంటూ గుణాత్మక విద్య అందించాలని అన్నారు. గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో 128 పాఠశాల్లో అమలవుతున్న ఆనందలహరి కార్యక్రమంలో రాష్ట్రస్థాయిలో జిల్లా మూడవ స్థానంలో ఉందని, ఇదే స్ఫూర్తితో ఉపాధ్యాయులు భోధనా విధానాన్ని కొనసాగించి సమర్థవంతంగా అమలు చేయాలనీ పేర్కొన్నారు. జిల్లాలోని 17 మండలాల నుంచి 35 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. రిసోర్సు పర్సన్స్ యం. వేణు, మాస్టర్ కోచ్ లు యం. శివయ్య, ఎ. గణేష్, పి. జగదీష్, బి. స్వర్ణకుమార్ లు వ్యవహరించారు. ఇంకా కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us