UPDATED 17th SEPTEMBER 2019 TUESDAY 6:30 PM
గండేపల్లి (రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన తృతీయ సంవత్సరం ట్రిపుల్ ఈ విద్యార్థి ఎం.టి.వి.ఎన్. సాయికుమార్ రాష్ట్రస్థాయి అండర్-21 వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ మాట్లాడుతూ ఈనెల 6,7,8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కడపలో నిర్వహించిన 6వ రాష్ట్రస్థాయి యూత్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 109 కేజీల విభాగంలో స్నాచ్, క్లీన్, జర్క్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 231 కేజీలు లిఫ్ట్ చేసి రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించాడని తెలిపారు. అలాగే వచ్చేనెల 13 నుంచి 22 తేదీల్లో బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో జరగనున్న నేషనల్ లెవెల్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, విభాగాధిపతి కె. మనోజ్ కుమార్ రెడ్డి తదితరులు సాయికుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్స్ ఎన్. శంకరరావు, ఎం. రాజు పాల్గొన్నారు.







