విజయవంతంగా ముగిసిన గేమింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు

UPDATED 22nd SEPTEMBER 2019 SUNDAY 9:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య టెక్నికల్ హబ్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు గేమింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు విజయవంతంగా ముగిసినట్లు టెక్నికల హబ్ సిఈవో బాబ్జి నీలం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంజనీరింగ్ విద్యార్థులకు వివిధ  సాంకేతిక పరిజ్ఞానాలలో అవగాహన కల్పిస్తూ వారి పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఆదిత్యలో గేమింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన 70మంది విద్యార్థులు 2డి, 3డి గేమ్స్ రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఫోనెయ్స్ టీమ్ విద్యార్థులు ప్రధమ బహుమతిగా రూ.30,000/-, రివెంజర్స్ టీమ్ విద్యార్థులు ద్వితీయ బహుమతిగా రూ.15000/-, ఫ్రీ బీస్ టీమ్ విద్యార్థులు తృతీయ బహుమతిగా రూ.5000/- నగదు బహుమతులుగా గెలుచుకొన్నారని తెలిపారు. ఆదిత్య డిగ్రీ కళాశాలలు (కాకినాడ,రాజమహేంద్రవరం)కు చెందిన 100మంది విద్యార్థులకు గేమింగ్ పట్ల స్ట్రీట్లాంప్ గేమ్స్ సిఈవో దీపక్ గురజాల ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చినట్లు బాబ్జి నీలం తెలిపారు. విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానం, వారిలో ప్రతిభను పెంచడానికి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టెక్నికల్ బృందాన్ని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అభినందించారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us