UPDATED 14th NOVEMBER 2018 WEDNESDAY 5:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే అంశంపై వర్క్ షాప్ కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాలు, ఎ.పి.ఎస్.ఎస్.డి.సి సంయుక్త ఆధ్యర్యంలో నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గోవడం ద్వారా విద్యార్థులు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవటంతో పాటు ఉద్యోగ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్స్ గా హాజరైన ఉప్పల సుమంత్, పుప్పల వెంకటేష్, జంపల శివనాగరాజులకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎం. రాధికామణి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాధిపతి డి. శిరీష, కాలేజ్ అకడమిక్ కమిటీ మెంబర్స్, వివిధ విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







