శ్రీ శృంగారవల్లభస్వామి హుండీల ఆదాయం లెక్కింపు

UPDATED 9th MARCH 2020 MONDAY 5:30 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసిఉన్న శ్రీ శృంగారవల్లభ స్వామి దేవస్థానం హుండీల ఆదాయాన్ని దేవస్థానం ఈవో కాట్నం జగన్మోహన శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ తనిఖీదారు వీఎల్ లక్ష్మీనరసింహారెడ్డి పర్యవేక్షణలో సోమవారం లెక్కించారు. హుండీల ద్వారా 39 రోజుల కాలానికి రూ.5,76,587 ఆదాయం సమకూరిందని, అలాగే  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి చెందిన 20 దీనార్లు విదేశీ కరెన్సీ లభించిందని ఆయన  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది సూరిమిల్లి వెంకటరమణ, ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, గోపాలాచార్యులు, గ్రామ యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us