UPDATED 7th JULY 2017 THURSDAY 3:00 PM
సామర్లకోట : తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని ఆలయ ధర్మకర్త మలకల సూర్యారావు (సూరిబాబు) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించామని, దీనిలో భాగంగా ప్రత్యేక హారతులు, అభిషేకాలు, విష్ణు, లలితా సహస్రనామ పారాయణాలు మొదలైన కార్యక్రమాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై బాబా వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తోటకూర రాంబాబు, సత్తిబాబు, కంటిపూడి గోపాలం, శ్రీనివాస ప్రకాశరావు, సూర్య ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.







