UPDATED 30th AUGUST 2018 THURSDAY 5:00 PM
సామర్లకోట: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ వైద్యునిగా పనిచేస్తున్న డాక్టర్ పి. చంద్రరావుకు పదోన్నతి లభించింది. అసిస్టెంట్ డిఎం అండ్ హెచ్ వో (ఎయిడ్స్ అండ్ లెప్రసీ) గా కర్నూలుకు పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ సామర్లకోట ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ చంద్రరావు ఎనలేని సేవలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, తదితరులు ఆయనను అభినందించారు.







