UPDATED 7th JANUARY 2020 TUESDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సంక్రాంతి సందర్భంగా సామర్లకోట పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి పందేలుతో పాటు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సామర్లకోట ఎస్ఐ సుమంత్ హెచ్చరించారు. సామర్లకోట మండల పరిధిలో గల గ్రామాల్లో పోలీసులు మంగళవారం మైక్ ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుమంత్ మాట్లాడుతూ సంక్రాంతిని పురస్కరించుకుని సామర్లకోట పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున పేకాట, కోడిపందాలు, గుండాట, అశ్లీల నృత్యాలు నిర్వహించరాదని అన్నారు. కోడిపందేలను కట్టడి చేసేందుకు ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, కోడి పందేల నిర్వహించడం నిషేధమని, కోడి పందేలకు ఎలాంటి అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు.







