ఘనంగా వివేకానంద స్కూల్ వార్షికోత్సవ, గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

UPDATED 29th MARCH 2018 THURSDAY 10:00 PM

సామర్లకోట: పట్టణంలోని మెహర్ కాంప్లెక్స్ వద్ద గల వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ తొమ్మిదవ వార్షికోత్సవ, గ్రాడ్యుయేషన్ వేడుకలు స్థానిక పూర్ణ కల్యాణ మండపంలో గురువారం ఘనంగా జరిగాయి. పాఠశాల కరస్పాండెంట్ సరోజని అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరైనారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ విద్యార్డుల భవిష్యత్తుకు క్రమశిక్షణ ఎంతో కీలకమని, క్రమశిక్షణ గల విద్యార్థులు భావిభారత ఉత్తమ పౌరులుగా విజయం సాధిస్తారన్నారు. అనంతరం విద్యార్థులకు పట్టాలు బహూకరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం, కంటే బాబు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, సర్పంచ్ కుర్రా నారాయణస్వామి, దవులూరి సుబ్బారావు, విద్యార్థుల తల్లితండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us