UPDATED 24th JULY 2019 WEDNESDAY 5:00 PM
పెద్దాపురం: పెద్దాపురం నూతన ఆర్డీవోగా భాద్యతలు స్వీకరించిన ఎస్. మల్లిబాబు సీనియర్ సివిల్ జడ్జి కె. రత్నకుమార్ ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి రత్నకుమార్ మాట్లాడుతూ ఏలేరు ప్రాజెక్టు బాధితులకు సంబంధించిన నష్టపరిహారం విషయంలో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని త్వరితగతిన పరిష్కరించేలా ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జడ్జి ఆర్డీవోకు సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీవోతో పాటు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గన్నంరాజు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.







