UPDATED 10th JULY 2018 TUESDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నత విద్య, సాఫ్ట్ వేర్ రంగాలలో అవకాశాలు అనే అంశంపై మంగళవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ సెల్ అధికారి ఎస్. వంశీ కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ సాఫ్ట్ వేర్ రంగంలో సరైన అవకాశాలను పెంపొందించుకోవడం విద్యార్థులపై ఉందని, ప్రస్తుతం నిర్వహిస్తున్న సదస్సు ఐటి, సి.ఎస్.సి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమ వక్త వెంకట కృష్ణారావు మాట్లాడుతూ కంప్యూటర్ టెక్నాలజీలో వేగవంతమైన అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి సాధించవచ్చని, వస్తు పరిశ్రమ దిశగా సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, డీన్ ఆర్ & డి డాక్టర్ పి.వి.యస్. మాచిరాజు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







