UPDATED 11th OCTOBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట:అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అర్బన్ ఐసిడిఎస్, ఐసీపీఎస్ (కాకినాడ) ప్రోజెక్టుల సంయుక్త ఆధ్వర్యంలో ఐశ్వర్య జూనియర్ కళాశాల విద్యార్ధినులచే గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. సామర్లకోట ఐసిడిఎస్ అర్బన్ సిపిడివో టీడీఆర్ పద్మావతి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ర్యాలీలో ఐశ్వర్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వి.వి.వి. రాజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ సత్యనళిని, రాజేశ్వరి, వీరమ్మ, డైరెక్టర్ పి. సతీష్, లెక్చరర్లు వి. రామకృష్ణ, ఎస్.వి. రాజేష్, విజయ, తదితరులు పాల్గొన్నారు.







