స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనంతబాబు

రంపచోడవరం (రెడ్ బీ న్యూస్) 12 నవంబర్ 2021: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనంత ఉదయభాస్కర్‌ (అనంత బాబు) పేరును వైకాపా అధిష్ఠానం ప్రకటించింది. స్థానిక సంస్థల కోటాలో తెదేపా తరఫున ఎమ్మెల్సీగా కొనసాగిన రెడ్డి సుబ్రహ్మణ్యం పదవీ కాలం ముగియడంతో ఆ స్థానానికి ఎన్నికల సంఘం ప్రకటన జారీచేసిన విషయం తెలిసిందే. ఈ ఎమ్మెల్సీకి డిసెంబరు 10న ఎన్నికలు, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇటీవల పంచాయతీ, పరిషత్తు, పాలక ఎన్నికల్లో వైకాపా ఆధిపత్యంతో ఈ స్థానాన్ని సులువుగా దక్కించుకుంటామనే ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఉదయభాస్కర్‌ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించి పార్టీ తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడం ఆనందంగా ఉందనీ.. సీఎం జగన్‌కు, పార్టీకి విధేయుడిగా ఉంటానన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us