పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

UPDATED 15th APRIL 2018 SUNDAY 9:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008-09 సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు, గురువులు ఆత్మీయ కలయిక ఆదివారం జి.పి.ఆర్ గార్డెన్స్ లో జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలలో వృత్తి, ఉద్యోగాలు చేస్తున్న ఆనాటి విద్యార్థినీ, విద్యార్థులు ఈ ఆత్మీయ కలయికకు హాజరయ్యారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని ఆనాటి మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు. కొంత మంది విద్యార్థినీ, విద్యార్థులు సకుటుంబ సపరివారంగా విచ్చేసారు. తమకు ఆనాడు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులు కె. శ్రీనివాసరావు, కె.ఆర్.కె.పి. శ్రీనివాస్, రాణి, విజయలక్ష్మి, నాగలక్ష్మి, కె. దుర్గారెడ్డి, లోవబాబు, రవికుమార్ లను దుశ్శాలువాలు, పూలమాలలుతో ఘనంగా సన్మానించి  జ్ఞాపికలు అందచేశారు. ఆత్మీయ విందు అనంతరం కేక్ ను ఆనాటి పాఠశాల హెడ్ మాస్టర్ కె. శ్రీనివాసరావు కట్ చేశారు. విద్యార్థులంతా ఉత్సాహంగా ఆడి, పాడారు. మళ్ళీ ఏడాది మరొకసారి కలుద్దామని తాము చదివిన పాఠశాల అభివృద్హికి సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించుకుని అంతా వెనుతిరిగారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us