UPDATED 31st JULY 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: మున్సిపల్ ఉద్యోగి రెహమతుల్లా ఖాన్ సేవలు అందరికీ ఆదర్శనీయమని మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు అన్నారు. మున్సిపల్ శాఖలో 36 సంవత్సరాలు ఉద్యోగిగా పనిచేసి పదవీవిరమణ పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయంలో వీడ్కోలు సభ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ ప్రజల గుర్తింపు పొందే విధంగా సేవలు చేసిన ఉద్యోగులు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలుస్తారని, ఆయన చేసిన సేవలను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మున్సిపల్ డిఇ సి.హెచ్. రామారావు, ఆర్.వో సి.హెచ్. వెంకటేశ్వర్లు, మేనేజర్లు అచ్యుతరావు, కె. డబ్యు. జయకర్, టిపివోలు మంజుల, శ్రీరమ్య, మునిసిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు గిడుతూరి శ్రీను, బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల హెచ్ఎం తోటకూర సాయి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు.







