UPDATED 25th OCTOBER 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): నైతిక విలువలతో కూడిన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని మండల విద్యా శాఖాధికారిణి ఎస్. విజయలక్ష్మీదేవి పేర్కొన్నారు. గత రెండు రోజులుగా మండల పరిధిలోని ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఆనంద వేదిక శిక్షణా తరగతులు శుక్రవారం ముగిసాయి. ముగింపు కార్యక్రమంలో ఎంఈవో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన విద్యకు ఒత్తిడి లేని పాఠశాల వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క ఉపాధ్యాయునిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ కెవిఎస్ఎస్ ప్రసాద్, పి. శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు సత్యవతి, టి. వెంకటరెడ్డి, పి. జాన్ మల్లేశ్వరరావు, మీనా మాధురి, ఇందిరాదేవి, యు. సత్యన్నారాయణ, శ్రీనివాసరాజు, శ్యామ్ సుందర్, రజనీకాంత్, గోవిందరాజులు, ఎం. శ్రీరామచంద్రమూర్తి, తోటకూర సాయిరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.







