ఘనంగా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు

UPDATED 23rd APRIL 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: మండలంలోని అచ్చంపేట మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 88వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ ఎన్.ఎ. రామచంద్రమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించడం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుందని, మంచి విద్యాబోధన జరుగుతుందని అన్నారు. పాఠశాల వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని  తెలిపారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి. జగన్మోహనరావు, ఎం.వి. పద్మావతి, ఎం. సత్తిబాబు, జి. త్రివేణి, ఎస్ దుర్గ, అధిక సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us