UPDATED 20th DECEMBER 2018 THURSDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ ప్రాంగణంలో జెఎన్టీయు (కాకినాడ) ఆధ్వర్యంలో జ్ఞానభేరి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, ఫార్మసీ, డిగ్రీ, పిజి కళాశాలల విద్యార్థులకు వివిధ విభాగాల్లో నిర్వహిస్తున్నక్రీడా పోటీలలో భాగంగా ఆదిత్యలో అథ్లెటిక్స్, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అథ్లెటిక్స్ విభాగంలో ఐదు, మూడు కిలోమీటర్ల పరుగు పందెం, షాట్ ఫుట్, డిస్క్ త్రో, లాంగ్ జంప్, వాలీబాల్ పోటీలకు ఆదిత్య ఆతిధ్యమిస్తుందని ఆయన తెలిపారు. ఈ పోటీలను ఆదిత్య ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శరభోజి ఆధ్వర్యంలో సిహెచ్ మురళీమోహన్ తో కూడిన 18 మంది ఆదిత్య ఫిజికల్ డైరెక్టర్ల పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా వాలీబాల్ పోటీలకు 210 మంది, అథ్లెటిక్స్ పోటీలకు 200 మంది పురుష, మహిళా క్రీడాకారులు పాల్గొన్నట్లు డాక్టర్ శరభోజి తెలిపారు.







