ప్రగతిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

UPDATED 10th OCTOBER 2019 THURSDAY 5:30 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో  ప్రపంచ దృష్టి దినోత్సవ కార్యక్రమం గురువారం నిర్వహించారు. కళాశాల ఎన్.సి.సి విభాగం, గోల్డెన్ జూబ్లీ లయన్స్ క్లబ్ (కాకినాడ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గోల్డెన్ జూబ్లీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ వై. నాగేంద్రకుమార్, నయన ఐ కేర్ (కాకినాడ)కు చెందిన రెటీనా స్పెషలిస్ట్ డాక్టర్ ఆర్. మెహర్ తేజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ నేటి యాంత్రిక జీవనంలో ప్రతీ వ్యక్తి కంటి సమస్యలపై దృష్టి సారించాలని, నివారణ కంటే నిరోధన ఉత్తమమని పేర్కొన్నారు. ముఖ్య అతిధి డాక్టర్ ఆర్. మెహర్ తేజ మాట్లాడుతూ దృష్టి సమస్యలు,తీసుకోవలసిన నివారణ చర్యలు గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం డాక్టర్ వై. నాగేంద్ర కుమార్, మోహనరావు, రమణమూర్తి, లయన్స్ క్లబ్ మెంబర్స్ మాట్లాడుతూ విద్యార్ధులు కంటి సమస్యల యొక్క నివారణ చర్యలను తెలుసుకుంటూ తమ పరిసరాలలో నివసించే వారికి కూడా తెలియచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధ బాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్  పి. రాజశేఖర ఫణీంద్ర, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us