UPDATED 19th FEBRUARY 2018 MONDAY 9:30 PM
సామర్లకోట: రైలు నుంచి జారిపడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర్లో ట్రాక్ పై పడి ఉండటాన్ని గుర్తించామని, ఆ వ్యక్తి రైలు నుంచి జారిపడడం వల్ల తలకు బలమైన గాయం తగిలిందని, దీంతో అతని 108 అంబులెన్స్ లో మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. కేసును ఆర్.పిహెచ్.సి పి. విజయకుమార్ దర్యాప్తు చేస్తున్నారు.







