క్రీడారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

UPDATED 6th JUNE 2018 WEDNESDAY 6:30 PM

సామర్లకోట: క్రీడారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి  నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో బావిశెట్టి సతీష్ కుమార్, కోడూరి శివ, అడబాల సతీష్ ఆధ్వర్యంలో రెండు రోజులుపాటు నిర్వహించే క్రికెట్ పోటీలను హోంమంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి బుధవారం ప్రారంబించారు. అనంతరం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ గ్రామీణస్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించడానికి పాఠశాల స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహిస్తున్నామని, ప్రపంచంలో అత్యున్నత క్రీడాకారులుగా పేరు పొందినవారు చాలామంది ఉన్నారని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడ రాణించాలన్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సహంతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన క్రీడాకారులు ఉన్నారని తెలిపారు. గ్రామాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాలు ఏర్పాటుకు  చర్యలు చేపడుతున్నామని, పెద్దాపురంలో రూ. రెండు కోట్లుతో స్టేడియం, రూ.రెండు స్విమ్మింగ్ పూల్ ను నిర్మిస్తున్నామని తెలిపారు. వ్యాయామ కళాశాలలను కూడా అభివృద్ధి పరుస్తున్నామని, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో కూడ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాస్థాయిలో 55 టీములు పాల్గొంటున్న ఈ పోటీలను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, సామర్లకోట, పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్లు అడబాల కుమారస్వామి, బొడ్డు బంగారుబాబు  చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ కంటే జగదీష్ మోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ చందలాడ అనంత పద్మనాభం, బడుగు శ్రీకాంత్, మన్యం చంద్రరావు, క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు బి. సతీష్ కుమార్, కోడూరి శివ, అడబాల సతీష్, జూనియర్ కళాశాల లైబ్రేరియన్ ఎం. శాంతిశ్రీ, అధ్యాపకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us