UPDATED 16th AUGUST 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: బిసి కార్పోరేషన్ ద్వారా విడుదల చేస్తున్న రుణాలు ఎక్కువ మంది లబ్ధిదారులకు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, కార్యదర్శి గోళ్ల నారాయణరావు డిమాండ్ చేశారు. సామర్లకోట పట్టణ, మండల పరిధిలో బిసిలు దాదాపు 40 శాతం జనాభా ఉన్నా కేవలం 54 మందికే రుణాలు వచ్చాయని, తక్షణమే బిసిలకు అదనంగా పెంచాలని, ప్రభుత్వం విడుదల చేసిన రూ. 54 లక్షలు ఏ మాత్రం సరిపోవని వెంటనే మరో రూ. రెండు కోట్లు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరణం సత్యనారాయణ, కరణం గోవిందు, తదితరులు పాల్గొన్నారు.







