ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఎంతో విలువైంది

UPDATED 25th JANUARY 2021 MONDAY 8:30 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఎంతో విలువైందని తహసీల్దార్ బూసి శ్రీదేవి పేర్కొన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహారాణీ కళాశాల విద్యార్థులతో కలిసి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు విధిగా ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ జె. సురేంద్ర, ఎలక్షన్ డిటి శ్రీనివాస్, ఎస్ఐ ఏ. బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.        

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us