కౌన్సిలర్ ఓటు గల్లంతు

UPDATED17th FEBRUARY 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట : సామర్లకోట వైసీపీ కౌన్సిలర్ ఓటు గల్లంతు అయ్యింది. మున్సిపాలిటీలో పదిహేనో వార్డు నుంచి గత ఎన్నికల్లో వైసీపీ కౌన్సిలర్ గా ఎన్నికైన నేతల వెంకటలక్ష్మి ఓటు గల్లంతు కావడంతో ఆమె విలేకరులకు శనివారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా అనేక ఓట్లు గల్లంతు అయినట్లు ఆరోపణలు రావడంతో ఓటర్ల జాబితాను పరిశీలించడం జరిగిందని చెప్పారు. సుమారు అరవై ఓట్ల వరకు గల్లంతయినట్లు చెప్పారు. అయితే కౌన్సిలర్ గా ఉన్న తన ఓటును తొలగించడం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పెద్దాపురం ఆర్డీవోకు ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us