ప్రజాసంక్షేమం టిడిపితోనే సాధ్యం

* అభివృద్ధిని చూసి ఓటేయండి
* హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప

UPDATED 2nd APRIL 2019 TUESDAY 9:00 PM

పెద్దాపురం: అన్ని వర్గాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కేవలం టిడిపితోనే సాధ్యపడుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పెద్దాపురం మండల పరిధిలో గల కాండ్రకోట, మర్లావ, తూర్పుపాకలు, తిరుపతి, పులిమేరు గ్రామాల్లో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ తో కలిసి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ  సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలన్నీ తెలుగుదేశం ప్రభుత్వం అందించినవేనని, ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. అన్నిరకాల పింఛన్లు, ఎన్టీఆర్‌ హౌసింగ్, పసుపు-కుంకుమ నిథులు మంజూరు, రుణమాఫీ వంటి పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధి మరింతగా జరగాలంటే తెలుగుదేశం గెలుపు అవసరమని, దీనికి ప్రజలంతా తమ పార్టీకి అండగా నిలిచి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో తమను గెలిపించాలని అన్నారు. మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అందరూ ఓట్లు వేసి తమ పార్టీకి అఖండ విజయం చేకూర్చాలని తెలిపారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపు చారిత్రక అవసరమని, కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేసి విజయం సాధించిపెట్టాలని అన్నారు. ఎక్కడకు వెళ్లినా ప్రజలు టిడిపి బ్రహ్మరథం పడుతున్నారని, గత అయిదేళ్లలో రాష్ట్రంలో మౌలిక వసతులు, పెన్షన్లు, పసుపు - కుంకుమ పథకాలు, మైనార్టీ, బీసీలకు వడ్డీలేని రుణాలు అందజేస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారితో చేతులు కలిపి అభివృద్ధికి అడ్డుపడుతూ స్వార్థ రాజకీయాలు, కుట్రలు చేస్తున్న వారిని ఓటు ద్వారా తరిమి కొట్టాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని,  చంద్రబాబు చేసిన అభివృద్ధి వల్ల ప్రచారంలో టిడిపికి మంచి ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, ఏఎంసి చైర్మన్ ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి), గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, టిడిపి మండల అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు(కోటి), కాండ్రకోట, పులిమేరు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్లు గవరసాన శివరామకృష్ణ, తుమ్మల వీరాస్వామి నాయుడు, శ్రీ శృంగారవల్లభస్వామి దేవస్థానం చైర్మన్ బందిలి సుబ్రహ్మణ్యేశ్వరావు, మెయిళ్ల కృష్ణమూర్తి, ఆత్మ చైర్మన్ కలకపల్లి రాంబాబు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.               

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us