UPDATED 29th AUGUST 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట (రెడ్ బీ న్యూస్) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో గల ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూల్స్ గా మార్చేందుకు విశేష కృషి చేయనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు తెలిపారు. తెలుగు భాషాత్సోవాలు సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గురువారం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆశయ సాధనలో తాను కూడా పాలుపంచుకుంటున్నానని, ప్రవాసాంధ్రుల సహకారంతో తమ దవులూరి ఛారిటబుల్ ట్రస్ట్, ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో గల ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూల్స్ గా మార్చేందుకు సంకల్పించినట్లు పేర్కొన్నారు. దవులూరి ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు, ప్రముఖ కార్మిక నాయకులు దవులూరి సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించి విద్యాబోధన చేయాలని, ప్రతీ ఉపాధ్యాయుడు మనస్పూర్తిగా తమ విద్యార్థులకు పూర్తిస్థాయిలో విద్యనందించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం ముఖ్య అతిథి దవులూరి దొరబాబు, మున్సిపల్ కమీషనర్ ఎం. యేసుబాబు, ఎంపీడీవో కె. స్వప్న, తహసీల్దార్ వజ్రపు జితేంద్రలకు మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులూ ఆవాల లక్ష్మీనారాయణ, తలారి దొరబాబు, సేపేని సురేష్, బొబ్బరాడ సత్తిబాబు, నేతల హరిబాబు, కానూరి పవన్, మండల విద్యాశాఖాధికారిణి ఎస్. విజయలక్ష్మి, బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల హెచ్ఎం తోటకూర సాయి రామకృష్ణ , గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.







