లెనోరాలో ఘనంగా ముగిసిన జాతీయస్థాయి విద్యార్థి సదస్సు

UPDATED 14th OCTOBER 2018 SUNDAY 9:30 PM

రాజానగరం: స్థానిక లెనోరా దంత వైద్య కళాశాల, ఆసుపత్రిలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి విద్యార్థి సదస్సు ఆదివారం ముగిసినట్లు కళాశాల చైర్ పర్సన్ కె. నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డివై పాటిల్ యూనివర్సిటీలతో పాటు వివిధ యూనివర్సిటీల నుంచి విచ్చేసిన నిష్ణాతులైన అధ్యాపకులు దేశం నలుమూలల నుంచి వచ్చిన వివిధ విభాగాలకు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు వైద్య విధానాలపై మెళుకువలు నేర్పించడమే కాకుండా రోజుకు ఏడు గంటలు టైపోడెంట్ వర్క్ షాప్ (ప్రాక్టికల్ తరగతులు) నిర్వహించారని తెలిపారు. మాజీ దంత వైద్య మండలి సభ్యులు డాక్టర్ కె. సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ కళాశాలలో విద్యార్థులకు వైద్య పరంగా ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకుంటూ వైద్యరంగంలో నైపుణ్యం పెంపొందించుకోవాలని అన్నారు. కళాశాల కార్యదర్శి వై. మధుసూదనరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఆధునిక విజ్ఞానం ఇలాంటి జాతీయ సదస్సుల ద్వారా అలవడుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఎత్తు, వంకర పళ్ళు సరిచేసుకోవాలని ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సదస్సు నిర్వాహక సంఘం చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మయ్యనాయుడు, కళాశాల డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాష్ శెట్టి, ప్రొఫెసర్ డాక్టర్ చలసాని కృష్ణ, ప్రొఫెసర్ డాక్టర్ కె. పవన్, డైరెక్టర్ పిజి స్టడీస్   డాక్టర్ బి. లక్ష్మణరావు, అధ్యాపక బృందం, అధిక సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us