UPDATED 12th MARCH 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక రాజీవ్ గృహకల్పలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు మద్దాల శ్రీను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఉన్నత ఆశయాల సాధన కోసం తమ పార్టీ ఆవిర్భవించిందని, అందుకు నిదర్శనమే మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తూ ప్రజలకు అండగా నిరంతరం పాలకులపై పోరాటాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సేపేని సురేష్, నేతల హరి, మంచెం సాయి, పిట్టా సత్యనారాయణ, కొంగు సందీప్ రాజ్, రెడ్డి శ్రీనివాస్, యండమూరి సుబ్బారావు, మమూర్తి రమణ ,చిట్టి మాని శ్రీనివాసులు, జగదీష్, కానుబోయిన విజయకృష్ణ వసంతల ప్రసాద్, సారంపూడి లోవచారి, ఎ.వి.ఎస్. రమణ, డేగల భాస్కర్, జుత్తుకు రాజు, వెదురుపాక వెంకటరమణ, కరణం సురేష్, తదితరులు పాల్గొన్నారు.







