దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర కీలకం

* దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు
* అట్టహాసంగా ప్రారంభమైన రిజల్యూషన్స్ -2020 వేడుకలు

UPDATED 13th MARCH 2020 FRIDAY 10:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): ఇంజనీరింగ్ వ్యవస్థ ఎక్కడ పటిష్టంగా ఉంటుందో ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు రిజల్యూషన్స్ -2020 పేరిట నిర్వహించనున్న యూత్ ఫెస్ట్ వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఫెస్ట్ కన్వీనర్ బేతినీడి వీరేంద్ర చౌదరి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ వేడుకలను కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ గమనాన్ని దిశా నిర్దేశం చేసే యువ ఇంజినీర్లు ఆధునిక సాంకేతిక పద్ధతులు అందిపుచ్చుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని అన్నారు. సమాజాన్ని సమర్ధవంతంగా, సౌకర్యవంతంగా నిర్మించడంలో ఇంజినీర్లు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని, విద్యార్థి దశ నుంచే తాము పోషించాల్సిన పాత్రపై స్పష్టత కలిగి ఉండాలని ఆయన తెలిపారు. ఫెస్ట్ కన్వీనర్ వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ భావి తరాలకు టెక్నాలజీ ఫలితాలు అందించేందుకు యువత కృషి చేయాలని, దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని  అన్నారు. తొలిరోజు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన పోస్టర్ ప్రెజెంటేషన్స్, ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్స్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, షార్ట్ ఫిలిం మేకింగ్ కాంపిటేషన్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్  విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాప్ కుమార్, బిఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ సోమశేఖర్, ఏవో కె ఆర్ సందీప్, ఈవో జెన్నిబాబు, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.        

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us