UPDATED 16th FEBRUARY 2019 SATURDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం నవర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్.సి.సి విద్యార్థుల ఆధ్వర్యంలో శనివారం ఉగ్రవాద వ్యతిరేక శాంతి ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీర మరణం పొందిన అమర జవాన్లకు ఆత్మశాంతి కలగాలని ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్.సి.సి అధికారి జివివి సత్యన్నారాయణ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయిని సిహెచ్ సత్యవతి మాట్లాడుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతీ పౌరుడు పోరాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.







