దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు రూ.50 వేలు ఆర్థిక సహాయం

UPDATED 28th DECEMBER 2018 FRIDAY 5:00 PM

పెద్దాపురం: 2014వ సంవత్సరం నాటికి మంజూరు లేకుండా గృహాలు నిర్మించుకున్న దారిద్రరేఖకు దిగువన ఉన్న పేదలకు రూ.50 వేలు ఆర్థిక సహాయం మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.  స్థానిక  హోంమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పేదరికంపై గెలుపు మూడవ విడత కార్యక్రమాన్ని మంత్రి జిల్లా కలెక్టరు కార్తికేయమిశ్రాతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఎంపిడివో పల్లాబత్తుల వసంతమాధవి అధ్యక్షతన జరిగిన యూనిట్లు పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి  చినరాజప్ప పాల్గొని మాట్లాడారు. అర్హత కలిగి వయస్సు తప్పుగా నమోదై పింఛన్లు పొందని వారికి వచ్చే సంవత్సరం జనవరి నెలలో నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో పింఛన్లు అందచేయడం జరుగుతుందని తెలిపారు. వచ్చే నెల నాల్గవ తేదీన రూ.16వందల కోట్లు వ్యయంతో నిర్మించిన పురుషోత్తపట్నం ఫేజ్-2 యూనిట్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారని అన్నారు. బిసిలకు బడ్జెట్లో రూ.10 వేలు కోట్లు కేటాయించి వారి సంక్షేమానికి కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగానే పేదరికంపై గెలుపు కార్యక్రమాన్ని నిర్వహించి బిసి, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనార్టీ వర్గాల వారికి కార్పోరేషన్ల ద్వారా చేతివృత్తుల వారికి ఆధునిక ఉపకరణాలు, బ్యాంకులు ద్వారా రుణాలు అందచేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో యూనిట్లు ద్వారా 1652 మందికి రూ.10 కోట్ల 96 లక్షలు విలువ గల యూనిట్లు పంపిణీ చేస్తున్నామని, వీటిలో ఎస్సీ కార్పోరేషన్ ద్వారా 259 మందికి, రూ.381.16 లక్షలు, బిసి కార్పోరేషన్ ద్వారా 225 మందికి రూ.167.3 లక్షలు, కాపు కార్పోరేషన్ ద్వారా 659 మందికి రూ.483.35 లక్షలు, ఐదుగురు మైనార్టీలకు రూ.10 లక్షలు, ఐదుగురు క్రిస్టియన్ మైనార్టీలకు రూ.9.5 లక్షలు, ఆదరణ ద్వారా 499 మందికి రూ.45.4 లక్షలు యూనిట్లును అందచేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టరు కార్తికేయమిశ్రా మాట్లాడుతూ సంక్షేమ పథకాలు పేదలకు అందించడంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలలో  ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చొరవతో హౌసింగ్, పింఛన్, రేషన్ మంజూరులో జిల్లాకు ఎక్కువ తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇప్పటి వరకు ఆదరణ పథకం క్రింద 600 కోట్లు యూనిట్లు పంపిణీ చేయడం జరిగిందని, వచ్చే జనవరిలో నాల్గవ విడతలో మిగిలిన వారికి అందచేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు వాషింగ్ మిషన్లు, ఆధునిక పరికరాలు, చెక్కులు మంత్రి, జిల్లా కలెక్టరు అందచేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసి సుందరపల్లి శివనాగరాజు, ఎంపిపి గుడాల రమేష్, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, పెద్దాపురం, సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్లు కొరిపూరి రాజు, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, సామర్లకోట ఏఎంసి వైస్ చైర్మన్ చిట్టిబాబు, బిసి కార్పోరేషన్ ఇడి జ్యోతి, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం. ఫ్రాన్సిస్, ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు, పెద్దాపురం, సామర్లకోట మున్సిపల్ కమీషనర్లు బిఆర్ శేషాద్రి, సిహెచ్ వెంకటేశ్వరరావు, సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, తోటకూర శ్రీను, కంటే జగదీష్ మోహన్, రంధి సత్యనారాయణ, గుమ్మళ్ళ రామకృష్ణ, వార్డు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us