UPDATED 6th OCTOBER 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: ప్రో కబడ్డీ పోటీలకు న్యాయనిర్ణేతగా సామర్లకోట పట్టణానికి చెందిన అల్ ఇండియా కబడ్డీ క్రీడాకారుడు భోగిళ్ళ మురళీకుమార్ వరుసగా నాల్గవసారి ఎంపికయ్యారు. ఈ మేరకు కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఉత్తుర్వులు అందినట్లు స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు తాళ్లూరి వైకుంఠం తెలిపారు. ప్రస్తుతం పిఠాపురం ఆర్.ఆర్.బి.హెచ్ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మురళీ కుమార్ ఒక్కరే జిల్లా నుంచి న్యాయనిర్ణేతగా ఎంపిక కావడం చాలా గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మురళీ కుమార్ ను ఆంధ్రా కబడ్డీ అధ్యక్షుడు కేఈ ప్రభాకర్, కార్యదర్శి వీర లంకయ్య, జిల్లా కోచ్ పి.వి.ఎస్.వి. ప్రసాద్, మన్యం చంద్రరావు, గంగిరెడ్డి బలరాం, జి. రాజబ్బాయి, గోలి దొరబాబు, తదితరులు అభినందించారు.







