UPDATED 11th JUNE 2020 THURSDAY 3:00 PM
రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): రంపచోడవరం ఏఎస్పీగా గరికపాటి బిందుమాధవ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2017 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన బిందుమాధవ్ గ్రేహౌండ్స్ ఏఎస్పీగా పనిచేశారు. విధుల్లోకి చేరిన బిందుమాధవ్ ను పలువురు పోలీస్ అధికారులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తూర్పు మన్యంలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు రంపచోడవరం ఏఎస్పీగా పనిచేసిన వకుల్ జిందాల్ కృష్ణా జిల్లా ఏఎస్పీగా బదిలీపై వెళ్లారు.







