UPDATED 26th NOVEMBER 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక 28వ వార్డు నందిపాటి హరిబాబు, మండల పరిధిలోని గొంచాల గ్రామం పోలా సత్యన్నారాయణ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు సోమవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దొరబాబు వెంట సానుభూతి తెలిపిన వారిలో దవులూరి సుబ్బారావు, కౌన్సిలర్ ఊబా జాన్ మోజేష్, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోలి వెంకటప్పారావు చౌదరి, పప్పుల వీరబాబు, కరణం సత్తిబాబు, ప్రసన్న, కరణం భాను, తదితరులు వున్నారు.







