దంత సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలి

* కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు

UPDATED 7th FEBRUARY 2020 FRIDAY 6:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): దంత సంరక్షణపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు పేర్కొన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో కళాశాల ఎన్ఎస్ఎస్ సేవా విభాగం, జిఎస్ఎల్ దంత వైద్య కళాశాల (రాజమహేంద్రవరం) సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ దంతాల సంరక్షణలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఎన్ఎస్ఎస్ సేవా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులు, కళాశాల సిబ్బందికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ఈ శిబిరంలో జిఎస్ఎల్ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. సునీల్, డాక్టర్ ఎస్. హరికృష్ణంరాజు (కమ్యూనిటీ డిపార్ట్ మెంట్), డాక్టర్  కె. మనోజ్ (మాడ్యులర్ సర్జరీ విభాగం) డాక్టర్ ఎస్. ప్రియాంకల ఆధ్వర్యంలో మొత్తం 27 మంది జూనియర్ డాక్టర్లు కలిసి 1500 మందికి వివిధ పరీక్షలు నిర్వహించి వైద్యం అవసరమైన విద్యార్థులు, అధ్యాపకులు 250 మందికి డెంటల్ క్లీనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, వివిధ విభాగాల అధిపతులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ పి. రాజశేఖర ఫణీంద్ర, బి. సుధీర్, ఫేకల్టీ, స్టూడెంట్ కోఆర్డినేటర్లు, జిఎస్ఎల్ దంత వైద్య కళాశాల పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎస్. చెల్లారావు, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us