విద్యార్థులకు విలువలతో కూడిన విద్య నేర్పాలి

UPDATED 12th SEPTEMBER 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను నేర్పాలని విద్యాశాఖాధికారిణి సజ్జా విజయలక్ష్మీదేవి అన్నారు. స్థానిక సిబిఎం సెంటినరీ ఉన్నత పాఠశాలలో సామర్లకోట పట్టణ, మండల పరిధిలో గల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో గురువారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులను భావిభారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే సత్తా ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ఉందని అన్నారు. పాఠశాలల్లో సెల్ ఫోన్స్ వినియోగించారని, డిఈవో ఆదేశాల ప్రకారం ఉపాధ్యాయులు నడుచుకోవాలని అన్నారు. ప్రతీ పాఠశాలలో రేడియో పాఠాలు సక్రమంగా జరిగేలా చూడాలని, పిల్లలు రేడియో పెట్టుకుని పాఠాలు వినే పద్ధతి అలవాటు చేయాలని అన్నారు. ప్రతీ పాఠశాలలో ఒక సక్సెస్ టీచర్ తయారుకావాలని, ఆవిధంగా ఆ పాఠశాల ముందంజలో ఉంటుందని అన్నారు. ప్రతీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నూరుశాతం అమలు జరిగేలా చూడాలని లేకపోతే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఆత్మీయంగా విద్యాభోధన చేసినప్పుడే ఆ విద్యార్థులు ఉత్తమ విద్యార్థులుగా తయారవుతారని అన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున పరిసరాల పరిశుభ్రత, పిల్లల ఆరోగ్యం, డెంగ్యూ వంటి వ్యాధులకు ఐసిడిఎస్ సహకారంతో ర్యాలీలు నిర్వహించి పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈనెల 27వ తేదీ లోపు విద్యాకమిటీ ఎన్నికలు పూర్తి చేయాలని సంబంధిత వివరాలను యాప్ లో నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల పరిధిలో గల ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు ఎంఆర్ పీలు, సిబ్బంది పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us