UPDATED 31st DECEMBER 2018 MONDAY 9:00 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జియో టెక్నికల్ ఇంజనీరింగ్ అనే అంశంపై సోమవారం సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టివి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గౌహతిలోని ఐఐటి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తాడికొండ వెంకట భరత్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. సివిల్ ఇంజినీర్లకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, వృత్తిలో విజయం సాధించాలంటే తాము ఎంచుకున్న సివిల్ ఇంజనీరింగ్ లో ప్రతిభ చూపాలన్నారు. పోటీ ప్రపంచంలో ధీటుగా నిలవాలంటే తమ నైపుణ్యాలకు, విజ్ఞానానికి పదును పెట్టాలని, నిర్మాణ రంగంలో సివిల్ ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. సివిల్ ఇంజనీరింగ్ లో వస్తున్న ఆధునాతన విధానాలపై పట్టు సాధించాలని అన్నారు. మృత్తికా శాస్త్రం ఆధారంగా మనదేశంలో బృహదీశ్వరాలయం, కోణార్క్ ఆలయాలు నిర్మాణాలు జరిగాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన సందేహాలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. అనంతరం కళాశాల తరఫున భరత్ ను ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ డి. వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







